Saturday, May 3, 2025
- Advertisement -

నిడదవోలు కూటమిలో ముసలం..

- Advertisement -

ఏపీలో కూటమి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ముఖ్యంగా జనసేన నేత, మంత్రి కందుల దుర్గేష్ వ్యవహార శైలీపై టీడీపీ నేతలు భగ్గుమన్నారు. తమకు తగిన ప్రాధాన్యం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు టీడీపీ నేతలు.

గతంలో ఇబ్బందులు పెట్టిన వైసీపీ నేతలను జనసేనలో చేర్చుకుంటున్నారని ఆరోపిస్తూ మంత్రి దుర్గేష్ తీరును ఖండించారు. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు అధ్యక్షతన విస్తృతస్థాయి సమావేశం జరుగగా నిడదవోలు పట్టణ టీడీపీ అధ్యక్ష పదవికి కొమ్మిన వెంకటేశ్వరరావు రాజీనామా చేశారు. మరికొంతమంది సైతం ఇదే బాటలో ఉండగా పరిస్థితులను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు బూరుగుపల్లి.

దీనంతటికి కారణం నిడదవోలు మున్సిపాలిటీని జనసేన పార్టీ కైవసం చేసుకోవడమే. దీనికి తోడు తమను మంత్రి దుర్గేష్ అసలు గుర్తించడం లేదని ఆరోపించారు బూరుగుపల్లి. అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవానికి సైతం తమను ఆహ్వానించలేదని… దీనిపై టీడీపీ అధిష్టానం స్పందించకుంటే మరిన్ని రాజీనామాలు ఉంటాయని శేషారావు హెచ్చరించారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -