పహల్గం ఉగ్రదాడి నేపథ్యంలో కీలక నిర్ణయం ప్రకటించింది బీసీసీఐ. భవిష్యత్తులో కూడా పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక సిరీస్ ఆడబోమని ప్రకటించింది. ఐసీసీ కారణంగానే పాక్‌తో తటస్థ వేదికలో ఆడుతున్నట్లు బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్ల వెల్లడించారు. ఇక్కడేం జరుగుతుందో ఐసీసీకి అవగాహన ఉందనుకుంటున్నామనిరాజీవ్ శుక్ల తెలిపారు.
భారత్ మరియు పాకిస్తాన్ మధ్య చివరి ద్వైపాక్షిక సిరీస్ 2012-2013 శీతాకాలంలో జరిగింది. ఆ సమయంలో పాకిస్తాన్.. భారతదేశానికి పర్యటన చేసి లిమిటెడ్ ఓవర్ల సిరీస్ ఆడింది. భారతదేశం చివరిసారిగా 2008లో ఆసియా కప్ సందర్భంలో పాకిస్తాన్ పర్యటనకు వెళ్లింది. ద్వైపాక్షికంగా చివరిసారిగా భారత్ 2005-2006లో పాకిస్తాన్‌ను పర్యటించింది.
తాము బాధితులతో ఉన్నాము…. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము అన్నారు. ఈ ప్రకటనతో భారత్ – పాక్ ద్వైపాక్షిక క్రికెట్ మ్యాచ్‌లు ఇకపై లేనట్లే.