Sunday, May 4, 2025
- Advertisement -

దేవర..అరుదైన ఘనత

- Advertisement -

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ పాత్ర‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ స‌మ‌ర్ప‌ణ‌లో ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్ ప‌తాకాల‌పై మిక్కిలినేని సుధాక‌ర్‌, హ‌రికృష్ణ‌.కె ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రెండు పార్టులుగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ పార్టు ప్ర‌పంచ వ్యాప్తంగా సెప్టెంబ‌ర్ 27న దేవ‌ర చిత్రం తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌లయాళ భాష‌ల్లో గ్రాండ్ రిలీజ్ కానుంది.

ఎన్టీఆర్ సరసన జాన్వీ క‌పూర్ హీరోయిన్‌గా న‌టిస్తోండగా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కీల‌క పాత్ర‌లో న‌టించారు. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన సినిమా ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా దేవర అరుదైన ఘనత సొంతం చేసుకుంది. దేవ‌ర ప్రీమియ‌ర్ షోను సెప్టెంబ‌ర్ 26 సాయంత్రం ఆరున్న‌ర గంట‌ల‌కు బియాండ్ ఫెస్ట్‌లో హాలీవుడ్, లాస్ ఏంజిల్స్‌లోని ఐకానిక్ ఈజిప్షియన్ థియేటర్‌లో ప్ర‌ద‌ర్శించ‌నున్నారు.

దీంతో ఇక్కడ ప్రీమియ‌ర్ కాబోతున్న తొలి ఇండియన్ సినిమాగా దేవ‌ర అరుదైన ఘ‌న‌త‌ను సొంతం చేసుకుంది. ఈ రెడ్ కార్పెట్ ఈవెంట్‌కు హాలీవుడ్‌కు చెందిన‌ ప్ర‌ముఖ సినీ ప్ర‌ముఖులు హాజ‌రు కాబోతున్నారు. త్న‌వేలు సినిమాటోగ్రాఫ‌ర్‌గా, శ్రీక‌ర్ ప్ర‌సాద్ ఎడిట‌ర్‌, సాబు శిరిల్ ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌గా వ‌ర్క్ చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -