జనసేనలో వర్గపోరు తారాస్థాయికి చేరింది. వైసీపీకి గుడ్ బై చెప్పిన తర్వాత బాలినేని.. జనసేనలో చేరిన తర్వాత వర్గపోరు మరింత పెరిగిపోయింది. ముఖ్యంగా ప్రకాశం జిల్లా పార్టీ అధ్యక్షుడు రియాజ్‌కు, బాలినేని మధ్య దూరం రోజురోజుకు పెరిగిపోతోంది.
బాలినేని చేరికపై మొదటి నుంచి రగిలిపోతున్న రియాజ్… బాలినేని టార్గెట్‌గా బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. నిజానికి బాలినేని పార్టీలోకి రావడం రియాజ్‌కు ఇష్టం లేదు. బాలినేని రాకను అడ్డుకునేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. బాలినేనిని ఇంతవరకు కలవలేదని, ఇక ముందు కూడా కలిసేది లేదని రియాజ్ తెగేసి చెప్తున్నారు.
అయితే పవన్ ప్రధాన అనుచరుల్లో ఒకరు రియాజ్. అలాంటి నేతకే ఇలాంటి పరిస్థితి రావడం జనసేన నేతల్లో చర్చనీయాంశంగా మారింది. దీంతో జనసేలో మొదటి నుండి ఉన్న నేతలను కలుపుకుని బాలినేని టార్గెట్‌గా విమర్శలు చేస్తున్నారు రియాజ్. అటు బాలినేని సైతం తన మార్క్ చూపిస్తుండటంతో వర్గపోరు తారాస్థాయికి చేరగా ఇది ఎక్కడి వరకు దారి తీస్తుందోనన్న చర్చ మాత్రం జరుగుతోంది. మరీ పవన్ ఎంటరై ఈ ఇద్దరి నేతల మధ్య సయోధ్య కుదుర్చుతారో వేచిచూడాలి.