Saturday, May 3, 2025
- Advertisement -

అధికారంలోకి వచ్చాక ఎవరిని వదలం!

- Advertisement -

తెలంగాణలో పాడి కౌశిక్ రెడ్డి వర్సెస్ అరెకపూడి గాంధీ మధ్య వివాదం తారాస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. ఇప్పటికే గాంధీపై హత్యాయత్నం కేసు నమోదుకాగా తాజాగా మరోసారి సంచలన కామెంట్స్ చేశారు కౌశిక్ రెడ్డి.

పీసీసీ చీఫ్ ఇప్పించాలని తనను రేవంత్ బతిమిలాడారని తెలిపారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కౌశిక్…తనను హత్య చేసేందుకు కుట్రలు చేస్తున్నారని…తెలంగాణ కోసం చావడానికైనా సిద్ధం అని వెల్లడించారు. ఎమ్మెల్యే ఇంటిపై దాడి చేయించానని.. సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడటం సిగ్గుచేటు అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక ఎవరిని వదిలిపెట్టబోమని తేల్చిచెప్పారు.

దాడులపై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తానని… హైదరాబాద్‌లో ఇంత టెన్షన్‌కు కారణం రేవంత్ రెడ్డి కాదా అని ప్రశ్నించారు. రేవంత్‌ను నమ్ముకుంటే కుక్క తోకను పట్టుకొని గోదారి ఈదినట్టు ఉంది ఫిరాయింపు ఎమ్మెల్యేల పరిస్ఠితి అని మర్శించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -