జనసేన ఎమ్మెల్యే,ఎంపీ,ఎమ్మెల్సీల సన్మాన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా నామినేటెడ్ పోస్టులను ఆశీస్తున్న వారిని ఉద్దేశించి మాట్లాడిన పవన్..టీడీపీ,బీజేపీ నుండి సైతం టికెట్ దక్కని వారు నామినేటెడ్ పోస్టులను ఆశీస్తున్నారని చెప్పుకొచ్చారు.
అయితే తగిన సమయంలో తగిన ప్రాధాన్యత దక్కుతుందని చెప్పారు. హరిప్రసాద్‌కు గుర్తింపు లభించినట్లే అందరికి న్యాయం జరుగుతుందని చెప్పారు. నామినేటెడ్ పోస్టులు ఉంటాయి.. కానీ ప్రతి ఒక్కరూ ఛైర్మన్ పదవులు ఆశిస్తే కష్టమని క్లారిటీ ఇచ్చేశారు.
ప్రధానంగా టీటీడీ ఛైర్మన్ సహా ఇంకొన్ని ఛైర్మన్ల పదవులు అడగుతున్నారని చెప్పిన పవన్… ఒక్క టీటీడీ ఛైర్మన్ పదవి కోసమే 50 మంది అడిగారని వెల్లడించారు. అయితే ఆ పదవి ఒక్కరికే దక్కుతుందని చెప్పారు. కొంతకాలంగా మెగాబ్రదర్ నాగబాబుకు టీటీడీ ఛైర్మన్ పదవి కట్టబెడతారని ప్రచారం జరుగుతుండగా దీనిపై క్లారిటీ ఇచ్చారు పవన్. తన కుటుంబ సభ్యులెవరు టీటీడీ ఛైర్మన్ పదవి అడగలేదని స్పష్టం చేశారు. నామినేటెడ్ పదవుల కోసం చంద్రబాబుని ఎలా అడగాలో తెలియడం లేదని… మీకిది చేశాం కాబట్టి.. మాకు ఈ పదవి ఇవ్వండి అని అడగలేమని తెలిపారు. అయితే అందరికీ న్యాయం జరిగేలా మాత్రం చూస్తానన్నారు.