రాజకీయాల్లో హత్యలుండవు…ఆత్మహత్యలే ఉంటాయని అంటారు. అంటే ఇదేదో మర్డర్ గురించి కాదు. కొంతమంది నేతలు తాము తీసుకునే నిర్ణయాలతో పొలిటికల్ సూసైడ్ చేసున్నట్లేనని. అంటే వారికి రాజకీయ భవిష్యత్ ఉండదని అర్ధం. ఇలా చాలా మంది నేతల జీవితాల్లో జరిగి రాజకీయ చిత్రపటంపై లేకుండా పోయారు. తాజాగా పవన్ తీసుకున్న నిర్ణయం అలాంటిదేనా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.
తెలంగాణలో పవన్ కల్యాణ్‌ను పావులాగా వాడుకునేందుకు సిద్ధమైంది బీజేపీ. ఇందులో భాగంగా పవన్ మద్దతు కోరగా ఆయన ఓకే చెప్పేశారు. దీంతో తెలంగాణలో టీడీపీని పక్కనపెట్టి బీజేపీతో జట్టుకట్టారు పవన్. ఇక పవన్ సంగతి ఎలా ఉన్న బీజేపీకి మాత్రం ఆయన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే సింగిల్‌గా పోటీ చేస్తే బీజేపీ మెజార్టీ సీట్లలో డిపాజిట్ కొల్పోవడం ఖాయం. అందుకే పవన్ మద్దతు కోరినా దీని వెనుక పెద్ద వ్యూహామే ఉందని తెలుస్తోంది. బీజేపీ చిత్తుగా ఓడితే ఆ నిందను పవన్‌పై వేయాలని భావిస్తోంది.
ఎందుకంటే పొత్తులో భాగంగా 30 నుండి 40 సీట్లను జనసేనకు కేటాయించి తమపై భారాన్ని తగ్గించుకోవాలని చూస్తోంది బీజేపీ. ఫలితంగా ఓటమిపై భారాన్ని కొంత పవన్‌పై వేయవచ్చని భావిస్తోంది. అందుకే పవన్‌తో పొత్తు అనే సరికొత్త వ్యూహంతో రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఏపీలో జనసేన పరిస్థితి కొంతలో కొంత మెరుగు. తెలంగాణలో మాత్రం శూన్యం.
అందుకే పవన్ సైతం తెలంగాణలో పోటీ అంటే కాస్త విముఖంగానే ఉన్నారు. పైకి 32 స్ధానాల్లో పోటీ చేస్తామని ప్రకటించిన చివరి నిమిషంలో డ్రాప్ కావాలని భావించారు. అయితే బీజేపీ ఎంట్రీతో అయిష్టంగానే పవన్ కలిసి పోటీచేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు పవన్ తీసుకున్న ఈ నిర్ణయంపై రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎందుకంటే తెలంగాణలో బీజేపీతో సమయం వృధా చేసుకోవడం కంటే పవన్ ఏపీపై కాన్సంట్రేట్ చేయడం మంచిదని కొంతమంది సూచిస్తున్నారు. ఏదిఏమైనా పవన్‌ని బీజేపీ బలిపశువు చేస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.