ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కారణంగా విద్యార్థులు కంటతడి పెట్టుకున్నారు. పవన్ అడవి తల్లి బాట కోసం విశాఖపట్నం ఏజెన్సీలో పర్యటించారు. పెందుర్తి మీదుగా వచ్చిన ఆయన కాన్వాయ్ ఆలస్యం అయింది. దీంతో అక్కడ జెఈఈ అడ్వాన్స్ పరీక్ష సెంటర్లకు విద్యార్థులు వెళ్లలేకపోయారు.
దాదాపు 30 మంది విద్యార్ధుల తల్లిదండ్రులు ఆందోళన చెందారు. తమ పిల్లల ముందే కంటతడిపెట్టారు. పిల్లల విద్యా భవిష్యత్తుపై దీర్ఘకాలిక ప్రభావం ఉంటుందని తల్లిదండ్రులు ఆందోళనలను వ్యక్తం చేస్తున్నారు. పెందుర్తి అయాన్ డిజిటల్ JE అడ్వాన్స్ విద్యార్థులు ఆలస్యంగా పరీక్షా కేంద్రానికి వెళ్ళారు. అదే సమయంలో పవన్ కాన్వాయ్ రావడంతో ట్రాఫిక్‌ను నిలిపివేశారు.
దాదాపు 30 మంది విద్యార్థులు పరీక్షకు లేట్‌గా వెళ్లారు. 2 నిమిషాలు ఆలస్యమయ్యిందంటూ విద్యార్థులను పరీక్షకు అనుమతించలేదు నిర్వాహకులు. దీంతో ఏం చేయాలో తోచని స్థితిలో ఉన్నారు విద్యార్థులు. విద్యార్థుల తల్లిదండ్రులు కంటతడిపెడుతున్న దృశ్యాలు అందరిని కలిచివేస్తున్నాయి.