Tuesday, April 23, 2024
- Advertisement -

నిరాశలో పవన్ కళ్యాణ్ హీరోయిన్.. ఎవరంటే?

- Advertisement -

తెలుగు పరిశ్రమలోకి 2010 వ సంవత్సరంలో “ఏం పిల్లో ఏం పిల్లడో” సినిమా ద్వారా అరంగ్రేటం చేసిన కన్నడ బ్యూటీ ప్రణీతకు మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది చిత్రంలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్న ప్రణీత తరువాత పాండవులు పాండవులు తుమ్మెద, హలో గురు ప్రేమకోసమే సినిమాలో హీరో రామ్ సరసన నటించారు. అయితే ఈ సినిమాలు పెద్దగా కలిసి రాలేదు.

ప్రస్తుతం తెలుగులో అవకాశాలు లేక పోవడమే కాకుండా మాతృభాష కన్నడలో కూడా ఈమెకు పెద్దగా అవకాశాలు ఏమీ కలిసి రాలేదు. ఈ క్రమంలోనే తన చూపును బాలీవుడ్ ఇండస్ట్రీ వైపు మళ్లించింది. ఇండస్ట్రీ లోకి ఎంటరైన పది సంవత్సరాలు తర్వాత బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ వరుసగా రెండు సినిమాలను లైన్ లో పెట్టారు.

Also read:ఈ ఫొటోలో ఉన్న పాప ఎవరో గుర్తుపట్టండి చూద్దాం..?

ఈ క్రమంలోనే ప్రణీత బాలీవుడ్ ఇండస్ట్రీలో “భుజ్ – ది ప్రైడ్ ఆఫ్ ఇండియా” ,”హంగామా 2″చిత్రాలలో నటించారు. ఈ రెండు సినిమాలు ఇదివరకు థియేట్రికల్ రిలీజ్ కావాల్సింది. కానీ కరోనా కారణం వల్ల విడుదలకు నోచుకోలేదు. ప్రస్తుతం ఈ రెండు సినిమాలు థియేట్రికల్ రిలీజ్ కాకుండా డిజిటల్ అవుతుండటం వల్ల హీరోయిన్ ప్రణీత కొంచం నిరాశ చెందుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే “భుజ్ – ది ప్రైడ్ ఆఫ్ ఇండియా” సినిమా డిస్నీప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతుంది. అందుకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. అదేవిధంగా హంగామా సీక్వెల్ కూడా హాట్ స్టార్ లో రిలీజ్ చేయడానికి చిత్ర నిర్వాహకులు ఈ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి తెలుగు, కన్నడ లో కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో తన అదృష్టం ఎలా ఉందో.

Also read:అను ఇమాన్యుల్ కు నెటిజెన్ వింత ప్రపోజల్..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -