రామ్ చరణ్ పుట్టినరోజు శుభాకాంక్షలు ప్రభుత్వ లెటర్‌హెడ్‌పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విషెస్ చెబుతూ లేఖ రాయడంపై తీవ్ర దుమారం చెలరేగింది. పవన్ అధికార దుర్వినియోగం చేశారని ఆరోపణలు వస్తున్నాయి.
పవన్ కల్యాణ్ అభిమానులు దీనిని ఆయన అభిమానానికి నిదర్శనంగా చూడగా, విమర్శకులు మాత్రం ప్రభుత్వ లెటర్‌హెడ్ వంటి అధికారిక పత్రాలు కేవలం ప్రభుత్వ కార్యక్రమాల కోసమే ఉపయోగించాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఈ తరహా చర్యలు రాష్ట్ర వనరుల దుర్వినియోగానికి దారి తీసే అవకాశం ఉందని పవన్ లాంటి వ్యక్తి ఇలా చేయడం సరికాదని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ అధికారిక చిహ్నాలు వ్యక్తిగత వ్యవహారాలకు వాడటం నైతికంగా ఎంతవరకు కరెక్టో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రభుత్వ నిబంధనలతోపాటు, ప్రజా విశ్వాసం, పరిపాలనా సమగ్రతను దెబ్బతీసే ప్రమాదం ఉందని పలువురు బహిరంగంగానే చెబుతున్నారు. మరి దీనిపై పవన్ ఎలా స్పందిస్తారో వేచిచూడాలి.