ఏపీని వరదలు ముంచెత్తగా పవన్ చేసిన ట్వీట్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే వరద సహాయక చర్యల్లో చంద్రబాబు చొరవను ప్రశంసిస్తూ వరుస ట్వీట్లు చేశారు పవన్. ఇప్పుడు అదే నెటిజన్ల చేత నవ్వు తెప్పిస్తోంది.
చంద్రబాబును ప్రశంసిస్తూ కేవలం 30 నిమిషాల వ్యవధిలో 5 ట్వీట్లు చేశారు పవన్ కళ్యాణ్ . డ్రోన్ల ద్వారా సహాయం అద్భుతంగా అందుతోందంటూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారంతో కృత్రిమంగా రూపొందించిన నకిలీ ఫొటోను ట్వీట్ చేశారు పవన్.
పవన్ స్వామి భక్తిని పక్కన పెడితే నెటిజన్లు మాత్రం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దీంతో వెంటనే ఆ ఫోటోని డిలీట్ చేశారు పవన్. ట్వీట్‌లో ఫొటోలు తీసేయచ్చేమోగానీ.. నువ్వు మాట్లాడిన మాటలు పోవుగా పవన్ కళ్యాణ్ అంటూ నెటిజన్లు కామెంట్ చేశారు. జనాగ్రహం నుంచి చంద్రబాబుని కాపాడేందుకే ఎత్తుగడలు వేస్తూ అడ్డంగా బుక్కయ్యావని మరికొంతమంది కామెంట్ చేశారు.