Saturday, May 3, 2025
- Advertisement -

10 నెలలు..ఇంకా జగన్‌పై నెపమేనా?

- Advertisement -

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికాంరలోకి వచ్చి 10 నెలలు గడుస్తోంది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలపై ప్రశ్నించిన ప్రతిసారి జగన్‌పై ఆ నెపాన్ని నెట్టుకుంటూ వస్తున్నారు. ప్ర‌జ‌ల‌కు ఎంతో చేయాల‌ని ఉందని కానీ గ‌ల్లా పెట్టె చూస్తే ఖాళీగా వుంద‌న్నారు… జ‌గ‌న్ దెబ్బ‌తో అప్పులు ఇవ్వ‌డానికి కూడా ఎవ‌రూ ముందుకు రాలేద‌న్నారు.

ఎంత‌సేపూ హామీల్ని అమ‌లు చేయ‌క‌పోవ‌డానికి వైఎస్ జ‌గ‌న్ చేసిన అప్పులే కార‌ణ‌మ‌ని ప్ర‌జ‌ల్ని క‌న్విన్స్ చేయ‌డానికే చంద్ర‌బాబు ప్ర‌య‌త్నిస్తున్నారు. గత ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ అప్పులు రూ.12 ల‌క్ష‌ల కోట్ల‌ అని ఒక‌సారి, రూ.14 ల‌క్ష‌ల కోట్లు అని ఆరోపించిన చంద్రబాబు.. ఇప్పుడేమో గ‌ల్లా పెట్టె ఖాళీ అంటూ స‌న్నాయి నొక్కులు నొక్కుతున్నారు.

2019లో తాను అధికారం నుంచి దిగిపోయే నాటికి కేవ‌లం రూ.100 కోట్లు మాత్ర‌మే గ‌ల్లా పెట్టెలో ఉంచి పోయాన‌ని చంద్ర‌బాబు మ‌రిచిన‌ట్టున్నారు. అప్పుడు అధికారంలోకి వ‌చ్చిన వైఎస్ జ‌గ‌న్ ఏనాడూ హామీల్ని అమ‌లు చేయ‌డానికి ఆర్థిక ఇబ్బందుల‌పై సాకులు చెప్ప‌లేదు.గత ప్రభుత్వం చేసిన అప్పులను కూడా పదే పదే ప్రస్తావించలేదు.

రెండేళ్ల పాటు కోవిడ్ మ‌హ‌మ్మారి ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను రాష్ట్రంతో పాటు యావ‌త్ ప్ర‌పంచాన్ని ఛిన్నాభిన్నం చేసింది. అయినా జ‌గ‌న్ వెనక‌డుగు వేయ‌లేదు. ఇప్పుడు చంద్రబాబు గారు ప‌దేప‌దే రాష్ట్రం ఆర్థికంగా క్లిష్ట ప‌రిస్థితిలో వుంద‌ని చెబుతూ, హామీల్ని అమ‌లు చేయ‌లేన‌ని, అర్థం చేసుకోవాల‌నే సందేశాన్ని పంపాల‌ని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. సూపర్ సిక్స్ హామలు అమలు చేయడానికి సంపద ఎలా సృష్టించాలో అడుగులు వేయండి సర్..ఇంకా జగన్ మీద పడి ఏడుస్తారెందుకు ? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -