- Advertisement -
చివరి వరకు జగన్‌తోనే ఉంటానని చెప్పారు మాజీమంత్రి పేర్ని నాని. మీడియాతో మాట్లాడిన నాని… జైలుకు పంపినా సరే జగన్ వెంటే నడుస్తానని చెప్పారు. కూటమి తప్పుల్ని ఎంగడుతూనే ఉంటాం అని తేల్చిచెప్పారు.
కూటమి ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగుతుందని ఇందులో భాగంగా తనతో పాటు తన భార్యపై క్రిమినల్ కేసులు పెట్టారన్నారు. ఓటేసి గెలిపించిన ప్రజలకు మేలు చేయకుండా.. వ్యవస్థలను రాజకీయ వేధింపులకు వాడుకోవడం సరికాదన్నారు.
ప్రభుత్వానికి జరిగిన నష్టానికి రెట్టింపు జమ చేశాం… అయినా నా భార్య జయసుధ పై ఏడు సంవత్సరాల పైబడి శిక్ష పడే సెక్షను పెట్టి అరెస్టు చేయాలని చూశారు అని ఆరోపించారు. అసలు సివిల్ సప్లై శాఖ అనేది ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు ఎవరిపైనా క్రిమినల్ కేసులు లేవు అన్నారు. వైసీపీ నుంచి తప్పుకునేది లేదు… ఎల్లప్పుడూ వైఎస్ జగన్ వెంటే ఉంటాం అని అన్నారు.