ఎన్టీఆర్‌లా జగన్ అభిమన్యుడు కాదు అర్జునుడిలా మీ కుట్రలను చేధిస్తారని తెలిపారు మాజీ మంత్రి పేర్ని నాని. మీడియాతో మాట్లాడిన నాని… చంద్రబాబు జైలులో ఉన్నప్పుడు ఆడిన డ్రామాలు అందరికి తెలుసన్నారు. ఇందుకు సంబంధించిన పేపర్ కట్టింగ్‌లను చదివి వినిపించారు నాని.దోమలను పంపి జైలులో కుట్టిచ్చి చంపేస్తారని నాటకాలు ఆడారని ధ్వజమెత్తారు.
ప్రజలు ఓట్లేస్తే అధికారం రావాలి కానీ ఒకరిని పడదోస్తే వచ్చే అధికారం ఎంగిలికూడుతో సమానం అని వైయస్ జగన్ భావిస్తారు. అందుకే వైయస్ జగన్ సింహం సింగిల్‌గా వస్తుందని చెబుతాం. అనంతపురం డ్రామాలు అని చంద్రబాబు చెబుతున్నాడు. జైల్లో భద్రత లేదని చంద్రబాబు చేసినదాన్ని డ్రామా అంటారు అని దుయ్యబట్టారు.
హెలికాప్టర్ విండ్ షీల్డ్ బద్దలు అయితే పైలెట్ ఎలా వెళ్లాడని ఓ తెలివైన మంత్రి అడుగుతారు.. పైలట్ ఏదో రకంగా వాహనాన్ని తీసుకువెళ్తారని మీకు తెలియదా అని ప్రశ్నించారు. జగన్‌కు సినిమా వాళ్ల కంటే ఎక్కువ క్రేజ్ ఉందని… అధికారం మీ దగ్గర ఉన్న.. తమతో జనం ఉన్నారని ఏడుస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో దిగజారుడు రాజకీయాలే నడుస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.