తన కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ వేధింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ మంత్రి పేర్ని నాని. గురువారం పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన నాని..నా భార్యను పిలిచి సీఐ ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు. మీ టైం నడుస్తోంది.. నడవనివ్వండి.. కచ్చితంగా మాకు ఒక రోజు టైం వస్తుంది అనుకున్నా. నా భార్యకు బెయిల్ వొచ్చే వరకు మాట్లాడవొద్దని లీగల్ టీం కోరింది.. ఆ మేరకే మాట్లాడడంలేదు. రాజకీయాల్లో తిరిగే వాళ్ల భార్యల పేరుతో బిజినెస్లు పెట్టొద్దు. నా భార్యని తీసుకొని రెండు రోజులుగా తిరుగుతూనే ఉన్నానని చెప్పారు.
2019 నుండి 24 మద్యలో సొంత టోల్ గేట్ పెట్టి డబ్బులు వసూలు చేసారని కాకాణి గోవర్దన్పై తప్పుడు కేసు పెట్టారు. కొడాలి నాని బందర్లో ఎవరో తలలు పగలుకొట్టారని కేసు పెట్టారు. నా మీద , నా భార్య మీద రేషన్ బియ్యం కేసు పెట్టారు అని ఆరోపించారు.
గోదాములో బియ్యం షార్టేజ్ ఉంటుందని, ఫైన్ కట్టాలని జాయింట్ కలెక్టర్ చెప్పారు. రూ. కోటి 80లక్షలు కట్టాలని చెబితే.. కోటి రూపాయలు అదే రోజు కట్టేశాం. మిగిలింది రెండు రోజుల్లో కడతామని చెప్పాం కాని వినలేదన్నారు. పౌర సరఫరాల శాఖ చరిత్రలో ఎవరి మీద కేసులు(అదీ క్రిమినల్ కేసులు) లేవు.. ఒక్క నా మీద తప్ప. నా దగ్గర పని చేసే వ్యక్తే నన్ను ముంచేశాడని తర్వాతే తేలింది అన్నారు.
ఇళ్ల పట్టాలు కొన్న విషయంలో జైల్లో వేస్తామని అన్నారుగా. మరి ఇప్పటిదాకా ఎందుకు వేయలేకపోయారు?. నేను పట్టాలు పంచిన సందర్భంలో నా పక్కన కమిషనర్, ఎమ్మార్వో సునీల్ కూడా వున్నారు. మరి ఆ ఎమ్మార్వోకి తెలియకుండా సంతకం పెట్టకుండా.. పంచిపెట్టామని ఎలా చెప్పారు?. ఆ సంతకాలు ఎమ్మార్వో సునీల్వి కాదని చెప్పే దమ్ముందా? ఫోరెన్సిక్ ల్యాబ్ పరీక్షలకు సిద్ధమేనా? అని పేర్ని నాని ప్రశ్నించారు.