Saturday, May 3, 2025
- Advertisement -

వైసీపీ నేత పేర్ని నాని హౌస్ అరెస్ట్..

- Advertisement -

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిదే. వంశీపై కిడ్నాప్‌, దాడి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బీఎన్‌ఎస్‌ సెక్షన్లు 140(1), 308, 351(3), రెడ్‌విత్‌ 3(5) కింద వంశీపై కేసు నమోదు చేశారు. వైసీపీ అధికారంలో ఉండగా గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో వంశీ ఏ71గా ఉన్నారు.

వంశీ అరెస్టు నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసుల ముందస్తు చర్యలు చేపట్టారు. వైఎస్సార్‌సీపీ నేతలను హౌస్‌ అరెస్ట్‌ చేస్తున్నారు. మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నానిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

ఏఆర్‌ ఏఎస్పీ, డీఎస్పీ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది మోహరించారు. ఈ క్రమంలో నానిని ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో, పోలీసుల తీరుపై పేర్ని నాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -