Saturday, May 3, 2025
- Advertisement -

చంద్రబాబు చెబితేనే పవన్‌కు పర్మిషన్ ఇవ్వలేదు!

- Advertisement -

స్టెల్లా షిప్‌ను తనిఖీ చేశారు సరే.. కెన్‌స్టార్ షిప్‌ను ఎందుకు వదిలేశారు? అని ప్రశ్నించారు కృష్ణా జిల్లా వైసీపీ అధ్యక్షులు పేర్ని నాని. మీడియాతో మాట్లాడిన నాని..ఆ షిప్‌లో కాకినాడ నుంచి ఆర్థిక మంత్రి వియ్యంకుడు బియ్యాన్ని తరలిస్తున్నట్లు మాకు సమాచారం ఉందన్నారు. ఆ షిప్‌పై ఎందుకు విచారణ జరపడం లేదు? చెప్పాలన్నారు.

పవన్ పర్యటనపై అంతా అనుమానంగానే ఉందని ….పోర్టు ఆఫీసర్, కస్టమ్స్ ఆఫీసర్ పవన్ తో బోటులోనే ఉన్నారని తెలిపారు. వాళ్లిద్దరూ షిప్ లోనే ఉండి పవన్ కు పర్మిషన్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కెన్ స్టార్ కు ఎందుకు వెళ్లరంటే ఆ ఎక్స్ పోర్టర్ పేరు వేల్పూరి శ్రీను… మంత్రి పయ్యావుల కేశవ్ కు స్వయానా వియ్యంకుడే ఈ వేల్పూరి శ్రీను అన్నారు నాని. వేల్పూరి శ్రీను ఎక్స్ పోర్టు చేస్తున్న బియ్యంలో దొంగ బియ్యం ఉండవా? పీడీఎస్ రైస్ ఉండవా వేల్పూరి శ్రీను అయితే మన కళ్లకు గంతలు కట్టేసుకుంటారా? అని ప్రశ్నల వర్షం కురిపించారు.

పవన్ ను షిప్ లోకి ఎక్కనివ్వొద్దని చంద్రబాబు చెప్పుండాలని లేదా పవన్ అబద్ధమైనా చెప్పుండాలని తెలిపారు. ప్రాణాలకు తెగించి స్టెల్లా షిప్ నే ఎందుకు సీజ్ చేస్తామని చెబుతున్నారని అనుమానం వ్యక్తం చేశారు. స్టెల్లా షిప్ ను 36 మంది ఎక్స్ పోర్టర్లు 35 వేల టన్నులు ఎక్స్ పోర్టు కోసం తెచ్చుకున్నారు. కెన్ స్టార్ షిప్ లో ఒకే ఎక్స్ పోర్టర్ 42 వేల టన్నుల బియ్యం ఎక్స్ పోర్టు చేస్తున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -