ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆంధ్రప్రదేశ్ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. మే 2న అమరావతిలో ప్రధాని మోడీ పర్యటించనున్నారని సీఎం చంద్రబాబు తెలిపారు. అమరావతి పునర్నిర్మాణ పనుల్లో భాగంగా మోడీ పర్యటన ఉంటుందని సీఎం చంద్రబాబు తెలిపారు.
అలాగే మూడేళ్లలో శాశ్వత సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు, రహదారులు పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. ఇంఛార్జ్ మంత్రుల పర్యటనలలో మూడు పార్టీల నేతల భాగస్వామ్యం ఉండాలని తెలిపారు సీఎం.
రెవెన్యూ సంబంధిత అంశాలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించిన సీఎం… రెవెన్యూ సమస్యల్లో పోలీసుల జోక్యం అంశాలను పరిష్కరించాలని చెప్పారు. సూర్యఘర్ పథకం అమలులో మరింత వేగం పెంచాలని దిశానిర్దేశం చేశారు. ఎస్సీ వర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్‌కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలపగా అసెంబ్లీ, హైకోర్టు భవన నిర్మాణ ప్రతిపాదనలకు ఆమోదం చెప్పింది. రూ.617 కోట్లతో అసెంబ్లీ, రూ.786 కోట్లతో హైకోర్టు భవన నిర్మాణం చేపట్టనున్నారు.