Saturday, May 3, 2025
- Advertisement -

అమరావతికి మోదీ..5 లక్షల మందితో సభ

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులను ఇవాళ ప్రారంభించనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. మధ్యాహ్నం 2.55 గంటలకు విజయవాడ విమానాశ్రయానికి చేరుకోనున్నారు ప్రధాని. ఏపీకి ప్రధాని వస్తున్న నేపథ్యంలో మొత్తం 6 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేశారు.

విమానాశ్రయం నుంచి వాయుసేన హెలికాప్టర్లలో సచివాలయం వద్ద హెలిప్యాడ్‌కు చేరుకోనున్నారు మోదీ. హెలిప్యాడ్ వద్ద మోదీకి స్వాగతం పలకనున్నారు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.

3.20 గంటలకు ర్యాలీగా ప్రజలకు అభివాదం చేస్తూ బహిరంగ సభా వేదికకు చేరుకోనున్నారు మోదీ. 3.30 గంటల నుంచి 4.45 గంటల వరకు అమరావతి పనుల పునః ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ప్రజా రాజధాని అమరావతి పనుల పునః ప్రారంభోత్సవ కార్యక్రమానికి సూచికగా పైలాన్ ఆవిష్కరించనున్నారు.

పైలాన్‌పై ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా వివిధ ప్రజాప్రతినిధుల పేర్లు ఉన్నాయి. వేదికపై 14 మంది ఆసీనులు అయ్యేలా ఏర్పాట్లు చేశారు. అమరావతి పనుల పునః ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు కానున్నారు హీరో చిరంజీవి, ఇతర ప్రముఖులు.

అనంతరం ఏర్పాటు చేసే బహిరంగసభ కార్యక్రమంలో 5 లక్షల మంది వరకు ప్రజలు హాజరవుతారని అంచనా వేశారు. కార్యక్రమానికి 5 లక్షల వరకు ప్రజలు హాజరవుతారని అంచనా . బహిరంగసభకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందలు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు. వేసవి రీత్యా తాగునీరు, మజ్జిగ, ఆహారం అందించేలా చర్యలు తీసుకున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -