చంద్రబాబు రాజకీయ జీవితంలో అబద్దాలు చెప్పినట్లుగా ఏ రాజకీయ నాయకుడు చెప్పి ఉండక పోవచ్చు. అధికారంలోకి రావడం కోసం ఎంత దూరం అయినా వెళ్తారు చంద్రబాబు. అవసరమైతే ఏ రాజకీయ పార్టీతోనైనా కలుస్తారు. గతంలో కాంగ్రెస్, ఇప్పుడు బీజేపీ టార్గెట్ ఒక్కటే అధికారంలోకి రావడం.
రాష్ట్ర విభజన నేపథ్యంలో 2014లో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం వంద శాతం వ్యయాన్ని తామే భరించి పూర్తి చేస్తామని విభజన చట్టంలో హామీ ఇచ్చింది. ఆ మేరకు పనులు చేపట్టేందుకు పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ)ని ఏర్పాటు చేసింది. 2014 జూన్ 8న సీఎంగా బాధ్యతలు స్వీకరించిన మీరు పీపీఏతో ఒప్పందం చేసుకోకుండా పోలవరం నిర్మాణ బాధ్యతలను రాష్ట్రానికి అప్పగించాలని కేంద్రాన్ని ఎందుకు కోరినట్లు? ఇలా చేయడం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టడం కాదా? మీరు కోరిన వెంటనే 2016 సెప్టెంబరు 7న అర్ధరాత్రి పోలవరం నిర్మాణ బాధ్యతలను రాష్ట్రానికి కేంద్రం అప్పగించడం, ఆ వెంటనే ప్రాజెక్టు కన్‌స్ట్రక్షన్ ప్రోటోకాల్‌ను తుంగలో తొక్కుతూ కమీషన్ల దాహంతో ప్రధాన కాంట్రాక్టర్ ట్రాన్స్‌ట్రాయ్‌ని అడ్డుపెట్టుకుని పనులన్నీ సబ్ కాంట్రాక్టర్లకు మీరు అప్పగించడం వెంటవెంటనే జరిగిపోలేదా చంద్రబాబు? దీనిని సమాధానం చెప్పాలని డిమాండ్ చేసే పరిస్థితి నెలకొంది.
2005 నుంచి 2019 మధ్య జరిగిన పనులు 24.85 శాతం మాత్రమే జరిగితే, మిగతా 24.94 శాతం పనులు 2019–24 మధ్య వైయస్ జగన్ ప్రభుత్వ హయాంలో పూర్తి కావడం వాస్తవం కాదా చంద్రబాబు?
2014–19 మధ్య మీరు రూ.10,649.39 కోట్లు వ్యయం చేస్తే.. 2019–24 మధ్య వైయస్ జగన్ ప్రభుత్వ హయాంలో రెండేళ్లు కోవిడ్ ఉన్నా రూ.8,629 కోట్లు వ్యయం చేసిన మాట వాస్తవం కాదా?
పోలవరం ఎత్తు 45.72 మీటర్ల కంటే ఒక్క ఇంచ్ కూడా తగ్గదని 2021 నుంచి 2024 దాకా వైయస్ జగన్ గారు చెబుతూనే ఉన్నారు. ఇదే విషయాన్ని అప్పటి కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ కూడా ఇదే అంశాన్ని లోక్‌సభ, రాజ్యసభలో రాతపూర్వకంగా తేల్చి చెప్పారు.
ఇప్పుడు మీరు చేస్తున్నది ఏంటి? పోలవరంలో నీటి నిల్వ చేసే ఎత్తును 41.15 మీటర్లకే పరిమితం చేసేందుకు మీరు అంగీకరించలేదా? ఇదే విషయం తాజా బడ్జెట్ సాక్షిగా మరోమారు బట్టబయలు కాలేదా చంద్రబాబు?. పోలవరం నిర్మాణ విషయంలో ఎన్ని విష ప్రచారాలు చేసినా వాస్తవాలు ప్రజలకు తెలుసు. మీరు పోలవరంలో ఇన్నేళ్లలో చేయలేని పనులు జగన్ కేవలం ఐదేళ్లలలో మీకంటే ఎక్కువ పనులు చేశారన్నది వాస్తవం.