Saturday, May 3, 2025
- Advertisement -

పవన్‌కు మహేశ్‌కు షాక్..!

- Advertisement -

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు షాక్ తగిలింది. విజయవాడ వెస్ట్ టికెట్ ఆశీంచి కార్యక్రమాలు చేస్తూ వస్తున్న పోతిన మహేష్‌..జనసేనాని పవన్‌కు షాకిచ్చారు. విజయవాడ వెస్ట్ టికెట్‌ను బీజేపీకి కేటాయించడాన్ని నిరసిస్తూ ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు అనుచరులతో సమావేశమైన మహేష్..ఇందుకు సంబంధించిన నిర్ణయాన్ని వెలువరించనున్నారు.

వాస్తవానికి విజయవాడ వెస్ట్ టికెట్ కోసం టీడీపీ – జనసేన నాయకుల మధ్య నువ్వా,నేనా అన్నట్లు ఫైట్ జరిగింది. టీడీపీ నుండి జలీల్ ఖాన్, వెంకన్న టికెట్ ఆశీంచగా జనసేన నుండి మహేష్ పేరు ప్రధానంగా వినపడింది. అయితే ఉహించని విధంగా ఈ సీటును పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించారు.

ఇక బీజేపీలో పలువురు నేతలు టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అడ్డూరి శ్రీరామ్, గోలగాని రవిక్రిష్ణ,పోలిశెట్టి రవికుమార్ పేర్లు వినిపిస్తుండగా త్వరలోనే అభ్యర్థిని ఖరారు చేసే అవకాశం ఉంది. మొత్తంగా సెకండ్ లిస్ట్ తర్వాత టీడీపీ – జనసేన అధినేతలకు షాక్‌ల మీద షాక్‌లు తగులుతూనే ఉన్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -