Saturday, May 3, 2025
- Advertisement -

కొత్త భక్తుడికి పంగనామాలెక్కువ..నిజమే కాదా!

- Advertisement -

కొత్త భక్తుడికి పంగనామాలెక్కువ..ఈ మాటలోనే ఎంతో అర్థం ఉంది. ఎందుకంటే గుడికి ఫస్ట్ టైం వచ్చినా లేక ఏదైనా కొత్త పని చేస్తున్నప్పుడు కానీ అది ఇట్టే తెలిసిపోతుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు అనుకుంటున్నారు.

తిరుపతి లడ్డూ వివాదంలో సినీ నటులు ప్రకాశ్‌ రాజ్ వర్సెస్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్య ట్విట్ వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ తీరును ప్రశ్నిస్తూ పరోక్షంగా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు ప్రకాశ్‌ రాజ్.

తాజాగా కొత్త భక్తుడికి పంగనామాలెక్కువ.. కదా? ఇక చాలు.. ప్రజల కోసం చేయాల్సిన పనులు చూడండి అంటూ తెలుగు, ఇంగ్లిష్‌లో ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు ప్రకాశ్ రాజ్. జస్ట్ ఆస్కింగ్ అంటూ ప్రకాశ్ రాజ్ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. ఆయన కామెంట్లు చేశారు.

మనకేం కావాలి… ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి ..తద్వారా రాజకీయ లబ్ధిని సాధించటమా? లేక ప్రజల మనోభావాలు గాయపడకుండా..‌ పరిపాలనా సంబంధమైన..‌ అవసరమైతే తీవ్రమైన చర్యలతో.. సున్నితంగా సమస్యను పరిష్కరించుకోవటమా? అంటే ఓ ట్వీట్, అలాగే గెలిచేముందు ఒక అవతారం… గెలిచిన తర్వాత ఇంకో అవతారం.. ఏంటీ అవాంతరం.. ఎందుకు మనకీ అయోమయం… ఏది నిజం?జస్ట్‌ ఆస్కింగ్‌? ఇలా ట్వీట్‌ల మీద ట్వీట్ చేస్తూనే ఉన్నారు ప్రకాశ్ రాజ్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -