తిరుమల లడ్డూ వ్యవహారంపై ఏపీ సీఎం చంద్రబాబు చిక్కుల్లో పడ్డ సంగతి తెలిసిందే. తన హయాంలో జరిగిన సంఘటనను గత ప్రభుత్వంపై రుద్దే ప్రయత్నం చేసి చంద్రబాబు బొక్కబొర్లా పడ్డారు. తన అనుకున్న టార్గెట్‌ని సాధించకపోవడంతో మతం రంగు పులిమి భావోద్వేగాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు కూటమి నేతలు.
ఇక లడ్డూ వ్యవహారంపై జస్ట్ ఆస్కింగ్ అంటూ తన దైన శైలీలో స్పందిస్తున్నారు నటుడు ప్రకాశ్ రాజ్. వరుస ట్వీట్లతో ఎవరి పేరు ప్రస్తావించకుండా హీట్ పెంచేస్తున్నారు. గురువారం గెలిచే ముందు ఒక అవతావరం.. గెలిచిన తరువాత ఇంకో అవతారం.. ఏంటీ అవాతారం.. ఎందుకు మనకీ అయోమయం.. ఏది నిజం? అని ట్వీట్ చేసిన ప్రకాశ్ రాజ్ తాజాగా మనకేం కావాలి ఆలోచించాలన్నారు.
ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి.. తద్వారా రాజకీయ లబ్ధిని సాధించటమా..? అని ప్రశ్నించారు. అలాగే ప్రజల మనోభావాలు గాయపడకుండా.. పరిపాలనా సంబంధమైన అవసరమైతే తీవ్రమైన చర్యలతో సున్నితంగా సమస్యను పరిష్కరించుకోవటమా? జస్ట్ ఆస్కింగ్ అంటూ పేర్కొన్నారు. అయితే ఇది పరోక్షంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి చేసిన కామెంటేనని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది.