Monday, May 5, 2025
- Advertisement -

రేవంత్‌పై ప్రశాంత్ కిషోర్ సంచలన కామెంట్స్

- Advertisement -

తెలంగాణలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడంలో ప్రధాన పాత్ర పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిది. కాంగ్రెస్‌లో పేరు మోసిన సీనియర్ లీడర్లు అంతా తమ నియోజకవర్గాలకే పరిమితమైన రేవంత్ మాత్రం అన్ని తానై కాంగ్రెస్‌ను ముందుకు నడిపించారు. ఇక గెలిచాక సీనియర్లు రేవంత్‌ని సీఎం కాకుండా చివరి వరకు అడ్డుకునే ప్రయత్నం చేయగా కాంగ్రెస్ అధిష్టానం మాత్రం రేవంత్ వైపే మొగ్గు చూపింది.

ఈ నేపథ్యంలో రేవంత్ పై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన కామెంట్స్ చేశారు. రేవంత్‌ను సీఎం అభ్యర్థిగా ముందే ప్రకటించి ఉంటే కాంగ్రెస్ ఖచ్చితంగా 100 సీట్లు దాటేసేదని తెలిపారు పీకే. ఎన్నిక‌లు అయ్యే వ‌ర‌కు సీఎం అభ్య‌ర్థి ఎవ‌రనేది తేల్చ‌క‌పోవ‌డం,సీనియర్లు తాము సీఎం రేసులో ఉన్నామని ప్రకటించుకోవడం ప్రజల్లో గందరగోళానికి దారి తీసిందని తెలిపారు.

ఒకవేళ రేవంత్‌ను ముందుగానే సీఎంగా ప్రకటించి ఉంటే కాంగ్రెస్‌ మరింత బలపడేదని తెలిపారు. వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఇండియా కూట‌మి పోటీ చేసే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేద‌ని… సీట్ల వివాదం కూట‌మి ని తీవ్రంగా ప్ర‌భావితం చేస్తుంద‌ని అంచ‌నా వేస్తున్నామ‌న్నారు. ఇక పీకే చేసిన వ్యాఖ్యలు రేవంత్‌కు మరింత బలం చేకూర్చగా ఆ పార్టీ నేతలు ఏ విధంగా స్పందిస్తారో వేచిచూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -