Saturday, May 3, 2025
- Advertisement -

లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌గా పురందేశ్వరి?

- Advertisement -

తెలుగు రాష్ట్రాలకు త్వరలో కొత్త బీజేపీ చీఫ్ రానున్న సంగతి తెలిసిందే. ఇక ఏపీ బీజేపీకి ప్రస్తుతం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అధ్యక్షురాలిగా ఉండగా త్వరలోనే ఆమెకు పదోన్నతి రానున్నట్లు తెలుస్తోంది. లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌గా పురందేశ్వరి పేరును బీజేపీ అధిష్టానం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

వివిధ భాషలపై ఆమెకున్న పట్టు, గతంలో కేంద్రమంత్రిగా పనిచేసిన అనుభవం, మహిళలకు ప్రాధాన్యం ఇచ్చామనే పేరు నేపథ్యంలో పురందేశ్వరి పేరును బీజేపీ పరిశీలిస్తోందని సమాచారం.

ఈ నేపధ్యంలో, బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన తర్వాత పురందేశ్వరిని లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌గా నియమించే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. టీడీపీ వ్యవస్థాపకుడు ,మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు కుమార్తె అయిన పురందేశ్వరి, రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరారు. గత లోక్ సభ ఎన్నికల్లో ఎంపీగా గెలుపొందారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -