అనారోగ్యంతో సినీ నటుడు, ఆర్ నారాయణమూర్తి హైదరాబాద్ నిమ్స్‌లో చేరిన సంగతి తెలిసిందే. స్వల్ప అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన నారాయణమూర్తికి డాక్టర్ బీరప్ప పర్యవేక్షణలో చికిత్స అందించారు. స్వల్ప అస్వస్థతతో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న నారాయణమూర్తి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆయన అభిమానులు ఆందోళన చెందారు.
దీంతో స్పందించిన ఆయన తాను ఆరోగ్యంగానే ఉన్నానని చెప్పారు. అభిమానులు ఎవరూ ఆందోళన చెందవద్దని తన ఆరోగ్యం బాగానే ఉందన్నారు. నిమ్స్‌లో చికిత్స తీసుకుంటున్నానని..దేవుడి దయవల్ల బాగానే కోలుకుంటున్నట్లు వెల్లడించారు. పూర్తిగా కోలుకున్న తర్వాత అన్ని వివరాలను వెల్లడిస్తానని తెలిపారు నారాయణమూర్తి.
మాదాల రంగారావు తర్వాత విప్లవాత్మక సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు ఆర్ నారాయణమూర్తి. ఎన్నో సినిమాలో నటించడమే కాదు దర్శకుడిగా, నిర్మాతగాను సినిమాలు చేశారు. వీర తెలంగాణ సినిమా తీసి తెలంగాణ ప్రజల హృదయాలను గెలుచుకున్నారు నారాయణమూర్తి.