- Advertisement -
ఐపీఎల్ 2025లో భాగంగా పంజాబ్ తొలి ఓటమిని చవిచూసింది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 50 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 206 పరుగుల టార్గెట్ ఛేదనలో 9 వికెట్లు కొల్పోయి 155 పరుగులు మాత్రమే చేసింది పంజాబ్.
నెహాల్ వధేరా 41 బంతుల్లో 62 పరుగులు చేయగా గ్లెన్ మ్యాక్స్ వెల్ 21 బంతుల్లో 30 పరుగులు చేశాడు. మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో పంజాబ్ కి ఓటమి తప్పలేదు.
ఇక అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్.. 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోర్ చేసింది. జైస్వాల్ 67,శాంసన్ 38,రియాన్ పరాగ్ 43 పరుగులు చేశారు. ఈ సీజన్ లో పంజాబ్ కు ఇదే తొలి ఓటమి. గత రెండు మ్యాచుల్లో గెలుపొందిన పంజాబ్.. మూడో మ్యాచ్ లో పరాజయం పాలైంది.