చిరుకు గురువుగా చేసిన అమితాబ్ కు చరణ్ ఏం గిఫ్ట్ ఇచ్చాడంటే ?

- Advertisement -

’సైరా’ సినిమా ఎంత పెద్ద సంచలన విజయం సొంతం చేసుకుందో అందరికి తెలిసిందే. ఈ సినిమాలో పెద్ద పెద్ద స్టార్స్ నటించారు. అమితాబ్, సుదీప్, జగపతిబాబు, విజయ్ సేతుపతి, నయనతార, తమన్నా వంటి స్టార్స్ నటించారు. ఈ సినిమాలో గోసాయి వెంకన్న గా నరసింహా రెడ్డి గురువు గా అమితాబ్ బచ్చన్ నటించారు. ఆయన పాత్రకు ఎంతో పేరు వచ్చింది.

అయితే చిరుతో ఉన్న ఫ్రెండ్ షిప్ కారణంగా అమితాబ్ ఈ సినిమాలో నటించాడు. పారితోషకం తీసుకోకుండా సొంత ఖర్చులతో షూటింగ్ కు వచ్చి వెళ్లేవారట. ఆయన స్నేహాన్ని వెలకట్టలేమని చెప్పిన చిరు.. ఇప్పుడు ఓ స్పేషల్ గిఫ్ట్ ఆయనకు అందించనున్నారట. కొణిదెల ప్రొడక్షన్స్ తరపున మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రేమతో అమితాబ్ కు ఖరీదైన కారును గిఫ్ట్ గా ఇవ్వనున్నారట.

- Advertisement -

రోల్స్ రాయిస్ ఫాంటమ్ లగ్జరీ కార్ ను కానుకగా ఇచ్చేందుకు చరణ్ ఆల్రెడీ ప్లాన్ చేశాడట. అమితాబ్ గ్యారేజీలో ఇప్పటికే ఎన్నో స్పెషల్ కార్లు ఉన్నాయి. ఇప్పుడు చరణ్ ఇచ్చే కారు వాటికన్న స్పెషల్ ఉండనుందని తెలుస్తోంది. ఈ కారు ఖరీదు 8 కోట్ల వరకు ఉండచ్చని తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -