Saturday, May 3, 2025
- Advertisement -

తెలంగాణలో సీఎం మార్పు.. రేవంత్ క్లారిటీ!

- Advertisement -

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జీగా మీనాక్షి నటరాజన్‌ను నియమించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం మార్పుపై కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సీఎం మార్పుపై జరుగుతున్న ప్రచారంపై స్పందించారు రేవంత్ రెడ్డి.

ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్‌గా మాట్లాడిన రేవంత్.. తెలంగాణలో సీఎం మార్పు లేదని క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ హైకమాండ్‌తో ఏదైనా సాధించుకునే సత్తా తనకు ఉందని..గాంధీ కుటుంబంతో తనకు మంచి అనుబంధం ఉందన్నారు. అధిష్టానాన్ని కలిసినట్టుగా ఫొటోలు దిగి చూపించాల్సిన అవసరం లేదన్నారు.

తాను ఎవరి ట్రాప్‌లో పడనని.. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ ప్రచారంలో వాస్తవం లేదని కొట్టిపారేశారు. ప్రభుత్వం, పార్టీపై తనకు పూర్తి పట్టు ఉందని చెప్పుకొచ్చారు. నేను ఎవరో తెలియకుండానే పార్టీ పీసీసీ చీఫ్, సీఎంను చేశారా? అని ప్రశ్నించారు.రాష్ట్రంలో ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సిన బాధ్యత ప్రతిపక్ష పార్టీకి ఉందని అన్నారు. ఇప్పటికైనా కేసీఆర్ బడ్జెట్ సమావేశాలకు హాజరు కావాలని సీఎం రేవంత్ కోరారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -