ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌లకు ఆడబిడ్డలు లేరు, వారికి ఆ విలువ తెలియదన్నారు మాజీ మంత్రి రోజా. హోం మంత్రి అనిత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లకు ఆడబిడ్డలున్నారు మరి ఆడపిల్లలకు ఇంత అన్యాయం జరుగుతుంటే ఏం చేస్తున్నారు? అని ప్రశ్నించారు. వీళ్లకు మనస్సాక్షి లేదా?, రాష్ట్రంలో ఆడపిలల్లకు దినదినగండంలా ఉందన్నారు. చంద్రబాబు, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ షూటింగ్‌లే కావాలంటే రాజీనామా చేసి వెళ్లిపోండని చురకలు అంటించారు.
ఏపీలో నేరస్తులు, ఉన్మాదులు పేట్రేగిపోతున్నారు…. నాయకులు, కార్యకర్తలు కాలకేయుల్లా మారి ఆడపిల్లల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వంలో పోలీస్ వ్యవస్థను కక్షసాధింపు చర్యలకు, తప్పుడు కేసులు పెట్టడానికి వాడుతున్నారు…వైసీపీ నేతలను వేధించడానికి వాడుతున్నారు అన్నారు.
ప్రజలకు, అసహాయులకు న్యాయం చేసేందుకు ఈ ప్రభుత్వంలో ఎవ్వరూ పనిచేయడం లేదు…మీడియాతో మాట్లాడటం తప్ప చేతల్లో ఏదీ జరగడం లేదు అన్నారు.
తమ తప్పులు బయటపడుతుంటే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు…చంద్రబాబు చేతగానితనం వల్ల వరదల్లో ఎందరో నష్టపోయారు అన్నారు. నాలుగు నెలల్లో 74 సంఘటనలు జరిగాయి…మహిళా హోంమంత్రి రోజూ నేను గన్ పట్టుకుని తిరగాలా అని కేర్లెస్‌గా మాట్లాడుతోందని విమర్శించారు రోజా.
బద్వేల్‌లో ఇంటర్ అమ్మాయి దారుణంగా చనిపోతే కనీసం పట్టించుకోని చంద్రబాబు….. వీకెండ్‌లో హైదరాబాద్‌కి స్పెషల్ ఫ్లైట్‌లో వెళ్లి బామ్మర్దితో నిస్సిగ్గుగా ఎంటర్‌టైన్‌మెంట్ షోలో ఎంజాయ్ చేశాడు. మరీ ఇంత దారుణమా? ప్రజలంతా ఆలోచించాలన్నారు.