Saturday, May 3, 2025
- Advertisement -

ప్రాణాలు తీసిన వారిని ఎందుకు కాపాడుతున్నారు..?

- Advertisement -

ప్రాణాలు తీసిన వారిని ఎందుకు కాపాడుతున్నారో చెప్పాలను మాజీ మంత్రి రోజా. వైకుంఠ ఏకాదశి దర్శన టోకన్లు పొందడం కోసం భక్తులు పరితపిస్తే ప్రభుత్వం, టీటీడీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా 6 మంది తమ ప్రాణాలను కోల్పోయారు అన్నారు. ఈ ఘటన కు టీటీడీ చైర్మన్, ఈవో, అదనపు ఈఓ వెంకయ్య చౌదరి, ఎస్పీ సుబ్బారాయుడు ప్రధాన కారణం అని ఆరోపించారు.

ఈ విషయం డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ కూడా ప్రజల్లో అగ్రహాం రావడంతో సమాజ మెప్పు కోసం అంగీకరించారు అన్నారు. పవన్ కళ్యాణ్ మాటలలోనే విధినిర్వహణలో టిటిడి చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామల రావు, అదనపు ఈఓ వెంకయ్యచౌదరి లు పూర్తిగా విఫలం అయ్యారు అని స్పష్టమయింది. మరి కీలక స్థానంలో ఉన్న ప్రధాన అధికారులు, పాలకండలి వైఫల్యమే కదా తొక్కిసలాటకి కారణం ఫలితంగా 6 గురు భక్తులు తమ నిండు ప్రాణాలు కోల్పోయారు అన్నారు.

అందుకు కారణమైన టిటిడి చైర్మన్, ఈఓ, అదనపు ఈఓ లపై చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ ఎందుకు అడగరు? చెప్పాలన్నారు. అంటే సమాజంలో ఉన్న అభిప్రాయం తాను చెప్పడం ద్వారా ప్రజలు మెప్పు పొందటం చంద్రబాబుకు ఇష్టమైన అధికారులపై చర్యలు కోరకుండా తన రాజకియ ప్రయోజనాలు కాపాడుకోవడం కాదా అన్నారు. ఇదేనా మీ సనాతన ధర్మం..? ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వేర్వేరుగా వచ్చారంటేనే మీ వ్యూహం ఏంటో అర్థమవుతుందన్నారు రోజా.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -