Saturday, May 3, 2025
- Advertisement -

వారివల్లే టీ20 ప్రపంచకప్‌ గెలిచాం!

- Advertisement -

మహేంద్రసింగ్ ధోని తర్వాత టీమిండియాకు ప్రపంచకప్ అందించిన కెప్టెన్‌గా రోహిత్ శర్మ నిలిచిన సంగతి తెలిసిందే. 17 ఏండ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ టీమిండియా వరల్డ్ కప్ గెలవగా ఈ సందర్భంగా ఆసక్తికర విషయాలు వెల్లడించాడు రోహిత్.

టీమిండియా టీ20 ప్రపంచకప్‌ గెలవడంలో ఆ ముగ్గురిదే కీలక పాత్ర అని వెల్లడించాడు. అప్పటి చీఫ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌, సెలెక్షన్‌ కమిటీ చైర్మన్‌ అజిత్‌ అగార్కర్‌, బోర్డు కార్యదర్శి జై షా ముగ్గురివల్లే భారత ప్రపంచకప్ కల 17 ఏండ్ల తర్వాత మళ్లీ సాకరమైందన్నాడు. దశాబ్ద కాలంగా ఐసీసీ ట్రోఫీ కల నెరవేరలేదన్న బాధ ప్రతీరోజు వేధిస్తుండేది. కానీ ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత ప్రతీ సందర్భాన్ని ఆస్వాధించానని చెప్పాడు రోహిత్.

మ్యాచ్‌కు ముందు ఫలితం గురించి కాకుండా ఎవరి పాత్ర వారు సమగ్రంగా నిర్వహించేలా ప్రణాళిక రూపొందించాం ఫలితంగా మంచి రిజల్ట్ రాబట్టామని చెప్పారు. మా ప్రణాళికకు అనుగుణంగా జైషా, ద్రవిడ్‌, అగార్కర్‌ నుంచి పూర్తి సహకారం లభించిందని చెప్పాడు రోహిత్. ఆటగాళ్లు సైతం సమిష్టిగా రాణించడంతో టీ20 వరల్డ్ కప్ భారత్ వశమైందన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -