Saturday, May 3, 2025
- Advertisement -

చంద్రబాబు దావోస్‌ టూర్‌ అట్టర్‌ ఫ్లాప్‌!

- Advertisement -

ఏపీ సీఎం చంద్రబాబు దావోస్ టూర్‌పై తనదైన శైలీలో సెటైర్లు వేశారు మాజీ మంత్రి రోజా. నాలుగు రోజుల చంద్రబాబు దావోస్ పర్యటన అట్టర్ ఫ్లాప్ అయిందన్నారు. భారీ ఆశలతో దావోస్‌ వెళ్లిన చంద్రబాబు బృందం వట్టి చేతులతో తిరిగి వచ్చిందని ఎద్దేవా చేశారు.

రాష్ట్రంలో కొనసాగుతున్న రెడ్‌బుక్‌ రాజ్యాంగంతో భయపడి పెట్టుబడుదారులు ముందుకు రావడం లేదని తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్‌ను దావోస్‌కు ఎందుకు తీసుకెళ్లలేదో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు రోజా.

పవన్‌ వస్తే లోకేష్‌ స్థాయి తగ్గిపోతుందని భయపడి తీసుకెళ్లలేదని…ప్రత్యేక విమానాలు, సూట్లు, బూట్ల పేరుతో కోట్లు ఖర్చు పెట్టినా కాని ఫలితం సాధించలేకపోయారన్నారు. ప్రజలను ఇంకెంతో కాలం అబద్దాలతో మభ్యపెట్టలేరన్నారు రోజా. రాష్ట్రంలో ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు వస్తారని నిలదీశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -