తమ అధినేత జగన్‌ను మళ్లీ సీఎం చేస్తామని తెలిపారు మాజీ మంత్రి రోజా. ఎన్నికల ఫలితాలు తారుమారయ్యాయి, ప్రజలు ఇంకా తేరుకోలేదు అన్నారు. నగరిలో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమంలో మాట్లాడిన రోజా..దేవుడి పాలన ఎలా ఉంటుందో వైఎస్ఆర్ చూపించారన్నారు. మళ్లీ వైఎస్ఆర్ ఆశయాలను నిలబెట్టుకునేలా జగన్ ను సీఎం చేసే విధంగా రాష్ట్రంలో ప్రజలకు మళ్లీ మంచి చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించే విధంగా పనిచేస్తామన్నారు.
వైఎస్సార్ ఒక యుగపురుషుడు అని …ఎన్నో సంక్షేమ పథకాలు అందించిన మహనీయుడు వైఎస్ఆర్ అని కితాబిచ్చారు. వైఎస్ఆర్ అంటే తెలుగు ప్రజలకు ఎమోషన్, వైఎస్ఆర్ అంటే తెలుగు ప్రజలకు అఫెక్షన్ అని కొనియాడారు. ఆయన భౌతికంగా ఆయన దూరంగా వెళ్లారు కానీ ఈనాటికి పేదల గుండెల్లో గుడి కట్టుకుని ఉన్న గొప్ప యుగపురుషుడు అని కొనియాడారు.
చరిత్రలో దేవుడి పాలన, రాముడి పాలన అని విన్నాం. అలాంటి పాలనను రాజశేఖర్ రెడ్డి పాలనలో అందరం కళ్లారా చూశాం… ఆయన లేని లోటును ఆయన బిడ్డ జగన్ నేనున్నా అంటూ వైఎస్ఆర్ ఆశయాల కోసం ఎన్ని కష్టాలు, అవమానాలను ఎదుర్కొని రాష్ట్ర ప్రజలకు మళ్లీ రాజన్న పరిపాలన అందించడం కళ్లారా చూశాం అన్నారు రోజా.