Sunday, May 4, 2025
- Advertisement -

కష్టాల్లో ప్రజలు..రియాల్టీ షోలో సీఎం!

- Advertisement -

కష్టాల్లో ప్రజలు రియాల్టీ షోలో నారా చంద్రబాబు నాయుడు ఇలా ఉంది రాష్ట్ర పరిస్థితి అని మండిపడ్డారు మాజీ మంత్రి ఆర్‌కే రోజా. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన చంద్రబాబు…ఈ రాష్ట్రం లో బాలికల పైన ఆడపిల్లల పైన మహిళల పైన హత్యలు, అత్యాచారాలు జరుగుతూవుండడం దురదృష్టకరం అన్నారు.

ఏ ముహూర్తాన నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడో గాని ఆడపిల్లలను నరికి చంపుతున్నారు తగలబెట్టేస్తున్నారు…చిన్నపిల్లలు పెద్దవారు అత్తా కోడలు అని వరస లేకుండా మతిస్థిమితం లేని వారని కూడా చూడకుండా ఎవ్వరిని వదిలి పెట్టకుండా నేరస్తులు ఎలా అఘాయిత్యానికి పాల్పడుతున్నారో మనం కల్లారా చూస్తున్నాం అన్నారు.

ఈ రాష్ట్ర చరిత్రలోనే ఈ నాలుగు నెలల్లో జరిగినన్ని దారుణాలు ఎప్పుడు కూడా జరగలేదు..దీనికి కారణం ఈ అసమర్థ ప్రభుత్వం, అసమర్థ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యణ్, హోంమంత్రి అనిత కారణం కాదా అని ప్రశ్నించారు. బాధిత కుటుంబానికి ఏ ఒక్క నాయకులూ వచ్చి అండగా నిలబడడం లేదు వీకెండ్ ఎప్పుడు వస్తుందా హైదరాబాద్ కు వెళదామా లైఫ్ ఎంజాయ్ చేద్దామా అన్న ధోరణిలో నాయకులు ఉన్నారు అని దుయ్యబట్టారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -