చంద్రబాబు ప్రభుత్వం ఆరునెలల్లోనే అరచేతిలో వైకుంఠం చూపిందని మండిపడ్డారు మాజీ మంత్రి రోజా. ప్రజలపై భారం మోపుతూ అంత ఖర్చు పెట్టి స్పెషల్ ఫ్లైట్స్ లో తిరిగే హక్కు మీకు ఎవరు ఇచ్చారని విమర్శలు గుప్పించారు. నగరిలో విద్యుత్ ఛార్జీల పెంపుపై వైసీపీ నేతలు చేపట్టిన ఆందోళనలో పాల్గొన్న రోజా..తనదైన శైలీలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
కూటమి నేతల తప్పుడు ప్రచారం వల్ల వైసీపీ ఓడిపోయిందని మండిపడ్డారు. రాష్ట్రంలో జగన్ ఓడిపోయినందుకు ప్రజలు బాధపడుతున్నారు. జగన్ ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చారని… వైయస్ జగన్ హయాంలో ప్రజలకు అన్ని పథకాలు అందాయి అని చెప్పారు.జగన్‌ను ఓడించాలని ఉద్యోగులు కంకణం కట్టుకున్నారు నేడు ఎందుకు చంద్రబాబును గెలిపించామా? అంటు బాధపడుతున్నారు అన్నారు.
ఇప్పుడు ఎవరైతే ఇబ్బందులు పెట్టారో.. వారికి వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తాం అని హెచ్చరించారు. రాష్ట్రంలో ఏం జరిగినా వైఎస్ జగన్మోహన్ రెడ్డే కారణమంటున్నారని మండిపడ్డారు. ఈ ప్రభుత్వానికి సిగ్గుందా? అని ప్రశ్నించారు. చంద్రబాబు హామీలకు ష్యూరిటీ లేదు, ఆయన మాటలకు గ్యారంటీ లేదు అని దుయ్యబట్టారు. రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచేశారు ఇవాళ వీధి వీధికి మధ్యం షాపులు పెట్టి ప్రజలను పీల్చి పిప్పిచేస్తున్నారు అని విమర్శించారు రోజా.