Sunday, May 4, 2025
- Advertisement -

వడ్డీతో సహా తిరిగిస్తాం.. మాజీ మంత్రి వార్నింగ్!

- Advertisement -

కూటమి సర్కార్‌కు వార్నింగ్ ఇచ్చారు మాజీ మంత్రి రోజా. జగన్ ను మళ్లీ సీఎం ను చేసే వరకు ఈ పోరాటం ఆపను అని…అధికారంలోకి రాకముందు బాబు ష్యూరిటీ, భవిష్యత్తుకు గ్యారెంటీ అన్నాడు కానీ ఇప్పుడు బాబు ష్యూరిటీ, బాదుడే బాదుడు గ్యారెంటీ అయిపోయిందన్నారు.

పవిత్రమైన పుణ్య క్షేత్రాల్లో కూడా పబ్బులు,బెల్ట్ షాపులు పెడుతున్నారు…జగన్ కట్ అవుట్ కు కూడా కూటమి ప్రభుత్వం భయపడుతుందన్నారు. గత ఎన్నికల సమయంలో కూటమి నేతలు తప్పుడు ప్రచారం చేసి.. అధికారంలోకి వచ్చారు. అందుకే వారిని ప్రజలు పట్టించుకోవడం లేదు అన్నారు.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లాంటి నాయకుడు ఏ రాష్ట్రంలోనూ దొరకడు…. అను నిత్యం పేద ప్రజల గురించి ఆలోచిస్తాడు… కుల, మత, పార్టీలకు అతీతంగా మంచి చేసిన వ్యక్తి అని కొనియాడారు. మళ్లీ జగనన్నను ముఖ్యమంత్రిని చేయాలని ఈ రోజు జనం భావిస్తున్నారు అని చెప్పారు. ఎన్నికలకు ముందు బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ అన్నారు. కానీ ఇప్పుడు బాబు ష్యూరిటీ, బాదుడే బాదుడు గ్యారెంటీ అయిపోయిందని విమర్శించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -