లింగమయ్యకు కుటుంబానికి వైసిపి కొండంత అండగా నిలిచింది. వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి ఆదేశాలతో రూ.5 లక్షల ఆర్థిక సాయం చేశారు. వైసీపీ నేత తోపుదుర్తి ఆత్మరామిరెడ్డి… లింగమయ్య భార్య, కుమారులకు చెక్కును అందజేశారు.
తెలుగుదేశం పార్టి గుండాల చేతిలో శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలం పాపిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కురుబ మజ్జిగ లింగమయ్య హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ హత్య రాష్ట్రాన్ని కుదిపేయగా జగన్ స్వయంగా వచ్చి ఆ కుటుంబ సభ్యులను పరామర్శించారు.
జగన్ పరామర్శ అనంతరం రూ. 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందించారు. శనివారం అనంతపురంలోని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నివాసంలో లింగమయ్య భార్య రామాంజనమ్మ, కుమారులు హరి, శ్రీనివాసులుకు చెక్‌ను అందజేశారు. వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీసత్య సాయి జిల్లా అధ్యక్షులు, మాజీమంత్రి ఉషశ్రీచరణ్, వై.యస్.అర్.సిపి సీనియర్ నాయకులు తోపుదుర్తి ఆత్మారామిరెడ్డి చేతుల మీదుగా చెక్ పంపిణీ చేశారు.