నాలుగు నెలల్లోనే ఇసుకని సాంతం దోచేశారు తెలుగు తమ్ముళ్లు. వైసీపీ హయాంలో నిండుగా కనిపించిన ఇసుక యార్డులన్నీ ఇప్పుడు ఖాళీగా దర్శనం ఇస్తున్నాయి. ఫ్రీ ఇసుక అంటూ.. కుచ్చుటోపీ పెట్టారు. ఇప్పుడు ఇసుక లేదంటే జనం ఉమ్మేస్తారని భయపడుతున్నారు. అందుకే ఆన్‌లైన్ బుకింగ్ పేరుతో నాటకాలాడుతోంది కూటమి ప్రభుత్వం.
ఇక 100 రోజుల పాలన పూర్తైన పథకాల అమలు గాలికొదిలేసి.. కోతలతో సరిపెట్టారు చంద్రబాబు. నాలుగు నెలల్లో ఒక్క పథకం కూడా అమలు చేయకుండా.. గత ఐదేళ్లుగా అందిన పథకాలకి వరుసగా కోతలు పెట్టారు. వైఫల్యాలను ప్రశ్నిస్తారని భయపడి.. టాపిక్ డైవర్ట్ చేస్తూ బురద రాజకీయాలతో సరిపెడుతున్నారు చంద్రబాబు.
పెన్షన్ పెంపు ముసుగేసి.. 100 రోజుల్లోనే లక్షా 50 వేల మందికి పింఛను కోత పెట్టారు చంద్రబాబు. అడిగితే.. చిత్ర, విచిత్రమైన కారణాలు చెప్తున్నారు కూటమి నేతలు.
అవ్వాతాతలపై ఎందుకు నీకు ఇంత పగ? అని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు.
కూటమి చేతగానితనంతో బెజవాడ వరద బాధితులకి తిప్పలు తప్పడం లేదు. టీడీపీకి అనుకూలమైన వారికే సాయం అందేలా పావులు కదిపారు తెలుగు తమ్ముళ్లు. దీంతో అర్హత ఉండి కూడా.. సాయం కోసం కలెక్టరేట్ వేలాది మంది బాధితులు పడిగాపులు కాస్తున్న పరిస్థితి నెలకొంది. చంద్రబాబు తీరును ప్రజలు తీవ్రంగా తప్పుబట్టారు.