ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయింది. హస్తినాపురం కార్పొరేటర్ బానోతు సుజాత నాయక్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. దీంతో సుధీర్ రెడ్డిపై Cr. No. 254/2025 U/s Sec. 3(2)(va), 3(1)(r)(w)(ii) SC/ST POA Act, 1989 & Sec. 79 BNS కింద కేసు నమోదు చేశారు పోలీసులు.
ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఆయన దిష్టి బొమ్మ దగ్ధం చేశారు కాంగ్రెస్ శ్రేణులు. వెంటనే సుధీర్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేత మధుయాష్కీ డిమాండ్ చేశారు.
ఇక తనపై ఎస్సీ ,ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ నమోదు చేయడాన్ని తప్పుబట్టారు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. రాజకీయ దురుద్దేశం తోనే ఎస్సీ ,ఎస్టీ ,అట్రాసిటీస్ యాక్ట్ నమోదు చేశారని.. …ఈ కేసు ను న్యాయస్థానం లో ఎదుర్కుంటానని తెలిపారు. కోర్టులో నాకు న్యాయం జరుగుతుందని నమ్ముతున్నానని.. కాంగ్రెస్ ,బీజేపీ లు కూడబలుక్కుని నాపై అక్రమ కేసు బనాయించారు అన్నారు.