Sunday, May 4, 2025
- Advertisement -

హమ్మయ్య..విలీనంపై క్లారిటీ వచ్చేసింది!

- Advertisement -

హమ్మయ్య ఎట్టకేలకు షర్మిల పార్టీ కాంగ్రెస్‌లో విలీనంపై క్లారిటీ వచ్చేసింది. షర్మిల రాకకు బ్రేక్‌లు వేయాలని చివరి వరకు ప్రయత్నించిన రేవంత్ చివరకు వెనక్కి తగ్గడంతో షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడానికి లైన్ క్లియర్ అయింది. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఈ మొత్తం ఎపిసోడ్‌కు మధ్యవర్తిత్వం వహించారు. జూన్లో మొదలైన ఈ చర్చలు నాలుగు నెలలు కావస్తున్నా ఎలాంటి ముందడుగు లేకపోవడంతో విలీనానికి బ్రేక్ పడిందని భావించారు.

ఈ వార్తలకు బలం చేకూరేలా సెప్టెంబర్‌ 30లోగా ఏదో విషయం తేల్చాలని కాంగ్రెస్ అధిష్టానానికి డెడ్‌లైన్ పెట్టారు. అయితే వీటిని కాంగ్రెస్ అధిష్టానం పట్టించుకోలేదు. దీంతో ఒంటరిగా బరిలోకి దిగేందుకే షర్మిల సిద్ధం కాగా తాజాగా కాంగ్రెస్ అధిష్టానం నుండి షర్మిలకు మరోసారి పిలుపురావడమే కాదు వైఎస్ఆర్టీపీని విలీనం చేసుకోడానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చింది కాంగ్రెస్ అధిష్టానం.

ఎలాంటి షరతులు, హామీలు లేకుండా వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు షర్మిల సిద్ధమైనట్లు సమాచారం. ఇప్పుడున్న పరిస్థితుల్లో విలీనం తప్ప మరో ఆప్షన్ లేకపోవడంతో ఈ నిర్ణయానికి వచ్చిందని ఆమె సన్నిహితుల సమాచారం. అయితే కాంగ్రెస్‌ మాత్రం షర్మిల సేవలను జాతీయ స్థాయిలో ఉపయోగించుకోవాలని భావిస్తోంది.

పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి, లేదంటే కర్ణాటక నుంచి రాజ్యసభ టికెట్ ఇచ్చే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. లేదంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తరువాత అప్పుడున్న పరిస్థితులను బట్టి ఖమ్మం లేదంటే సికింద్రాబాద్ నుంచి పార్లమెంట్‌కు పోటీ చేయించే అంశాన్ని అధిష్టానం పరిశీలిస్తోందని తెలుస్తోంది. సో మొత్తంగా షర్మిల – కాంగ్రెస్ పార్టీల ఎపిసోడ్‌కు శుభం కార్డు పడ్డట్లేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -