Monday, May 5, 2025
- Advertisement -

కోమటిరెడ్డి గెలుపు కష్టమే..షాక్‌ల మీద షాక్‌లు!

- Advertisement -

కోమటిరెడ్డి బ్రదర్స్‌…ఒకప్పుడు వారంటే కార్యకర్తలకు దైవంతో సమానం. ఆపద వచ్చిందంటే చాలు మేమున్నామంటూ భరోసా. అన్నా అని పిలిస్తే చాలు నేనున్నా అంటూ ముందుకొస్తారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నల్గొండ జిల్లాలోనే కోమటిరెడ్డి బ్రదర్స్ ఎదురిదాల్సిన పరిస్థితి నెలకొంది. ఇందుకు వారు అనుసరించిన పొలిటికల్ వ్యూహాలే కారణం.

ఇక రాజకీయాల్లో హత్యలుండవు…ఆత్మ హత్యలే ఉంటాయనడానికి ఉదాహరణగా ఈ బ్రదర్స్ మారిపోయారు. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ ఆ పార్టీ చనిపోయిందని, జాకీ పెట్టి లేపిన లేవదని వ్యాఖ్యానించేంతగా దిగజారిపోయారు. ప్రధానంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గురించి చెప్పాల్సిన పనిలేదు. సంవత్సరం క్రితం బీజేపీలో చేరి మునుగోడు ఉప ఎన్నికలకు కారణమైన రాజగోపాల్..తిరిగి కాంగ్రెస్‌లో చేరి సీటు దక్కించుకున్నారు.

సీటు అయితే దక్కించుకున్నారు కానీ ఈసారి గెలిచేది కష్టమే. ఎందుకంటే పార్టీ కార్యకర్తలే కాదు నేతలు సైతం రాజగోపాల్ తీరుపై గుస్సాగా ఉన్నారు. ఇక సీటు ఆశీంచిన కీలక నేతలు పార్టీని వీడారు. ఇక కృష్ణారెడ్డి అయితే కాంగ్రెస్‌ నుండి బీజేపీలో చేరి రాజగోపాల్‌కు వ్యతిరేకంగా పోటీ చేస్తున్నారు. కృష్ణారెడ్డికి మునుగోడులో గట్టి పట్టు ఉంది.

తాజాగా ఉప ఎన్నికల్లలో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన పాల్వాయి స్రవంతి కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పేశారు. రాజగోపాల్ ఓటమే తన ధ్యేయమని…కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తానని శపథం చేశారు. పార్టీలో మహిళనే గౌరవం కూడా ఇవ్వడం లేదని…డబ్బులున్న వారికే టికెట్లను అమ్ముకుంటున్నారని ఆరోపించారు. ఇక కోమటిరెడ్డి బ్రదర్స్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఈసారి రాజగోపాల్ గెలవడం అంతా ఈజీ కాదని తెలుస్తోంది. ప్రచారంలో సైతం కార్యకర్తల నుండి నిరసన వ్యక్తమవుతున్న ముందుకు సాగుతున్నారు రాజగోపాల్. మరి ఈసారి గెలుపు రాజగోపాల్‌ది అవుతుందా లేదా అన్నది డిసెంబర్ 3న తేలిపోనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -