ప్రశ్నించాలి… ప్రజా సమస్యలపై ప్రశ్నించడం తప్పా ఇది వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నన్ని రోజులు పవన్ గొంతు చించుకుని మరి చెప్పిన మాట?, కానీ ఇప్పుడు తీరా అధికారంలోకి వచ్చేసరికి ఆ ప్రశ్నించే గొంతు మూగబోయింది. గతంలో ప్రైవేటైజేషన్ కు వ్యతిరేకం అని చెప్పుకొచ్చిన పవన్.. ఇప్పుడు అధికారంలోకి వచ్చే సరికి ప్రైవేటీకరణకు సై అనే పరిస్థితి నెలకొంది.
జగన్ తీసుకువచ్చిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రైవేట్ పరం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు. మెడికల్ కాలేజీల నిర్మాణాలను ఎక్కడికక్కడ నిలిపివేసి ప్రైవేట్‌కు అమ్మేయడానికి జీవో ఇవ్వడం దారుణమని విమర్శించారు.
చంద్రబాబు 14ఏళ్ల అనుభవంలో ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ తీసుకురాలేకపోయారు కానీ ఇవాళ మెడికల్ కాలేజీల నిర్మాణాలను ఆపేసి ప్రైవేటుకు అమ్మేస్తే పేద విద్యార్థులకు మెడికల్ విద్య అందడం కష్టం అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వాస్తవానికి చంద్రబాబు అంటేనే ప్రైవేట్ పరం. బాబు గత చరిత్రను పరిశీలిస్తే ఇదే అర్థం అవుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో, ఆ తర్వాత రాష్ట్ర విభజన తర్వాత కూడా అదే పంథాను కొనసాగించారు. ఇప్పుడు ఆరోగ్యశ్రీని ప్రైవేటు ఇన్స్యూరెన్స్ కంపెనీ ఇవ్వడం.. చివరికి రూరల్ రోడ్స్ ను సైతం ప్రైవేట్ పరం చేయడం బాబు పాలనకు నిదర్శనం. ఇవన్నీ చూస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశ్నించకుండా ఏం చేస్తున్నారని సాధారణ ప్రజలు అడుగుతున్నారు. ఇక నెటిజన్లు అయితే సోషల్ మీడియాలో పవన్‌పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.