Saturday, May 3, 2025
- Advertisement -

గళమెత్తిన విద్యార్థిలోకం

- Advertisement -

కూటమి ప్రభుత్వంపై గళమెత్తింది విద్యార్థి లోకం. ఏపీ వ్యాప్తంగా విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. విజయవాడలో వైయస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో ఈరోజు జరిగిన యువత పోరుకి భారీగా తరలివచ్చారు విద్యార్థులు, నిరుద్యోగులు, వారి తల్లిదండ్రులు. 10 నెలల్లోనే కూటమి ప్రభుత్వంపై ఏర్పడిన వ్యతిరేకతకి సాక్ష్యంగా నిలిచింది యువత పోరు.

తిరుపతి కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టింది వైయస్ఆర్ కాంగ్రెస్. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులతో కలిసి ఆందోళన నిర్వహించారు. 5 వేలమందితో నిరసన చేయగా అనంతరం జిల్లా కలెక్టర్‌క వినతిపత్రం అందించారు భూమన కరుణాకర్ రెడ్డి.

.కూటమి ప్రభుత్వం తప్పుడు వాగ్దానాలతో ప్రజలను మోసం చేసింది అని మండిపడ్డారు భూమన.ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి నేడు ఒక్క హామీ ను కూడా నెరవేర్చ లేదు. జగన్ సీఎం గా ఉన్న సమయంలో నాడు నేడు ద్వారా విద్యా వ్యవస్థ ను సమూల మార్పులు చేశారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు బైజూస్, ట్యాబ్ లు అందించారు అని గుర్తు చేశారు.

డాక్టర్ కావాలన్న విద్యార్థులకు ఫిజు రీయింబర్స్మెంట్ ఇచ్చేవారు. నేడు కూటమి అంతకంటే ఎక్కువ చేస్తామని చెప్పింది..నేటి వరకు ఇచ్చిన 700 కోట్లు.. కానీ కావాల్సింది 4వేల కోట్ల రూపాయలు బడ్జెట్ లో కూడా తక్కవ కేటాయించారు. విద్యార్థులు చదువులు మానుకునే పరిస్థితి నెలకొంది. జగన్ మోహన్ రెడ్డి ఆదేశంతో నేడు కలెక్టర్ వద్ద ఆందోళన చేసి, కలెక్టర్ కి వినతిపత్రం సమర్పించాము అన్నారు.

డీఎస్సీ ఊసే లేదు..యువతకు ఉద్యోగం వచ్చేవరకు 3వేలు నిరుద్యోగ భృతి కల్పిస్తామని అన్నారు…నేటికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వం దగా చేస్తుంది. ప్రభుత్వం చేస్తున్న దగకోరుతనానికి వ్యతిరేకంగా నేడు ఆందోళన చేపట్టాము..జగన్ 15 మెడికల్ కాలేజీలు కట్టాలని నిర్ణయించారు.. ఇందులో 5 కాలేజీ పూర్తి చేశారు..కానీ నేడు మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తామని అంటున్నారు. దీనిని మేము వ్యతిరేకిస్తున్నాము . దీని మీద విద్యార్థులు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -