టీటీడీ గోశాలలో గోవుల మృతిపై వెటకారం చేసిన టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడికి అక్షింతలు వేశారు మాజీ ఎంపీ సుబ్రమణ్యస్వామి. వయసు మళ్లిన మనుషుల్లానే గోవులు చనిపోతున్నాయని అంటావా..? మరి రేపు నువ్వు కూడా చనిపోతే వయసు మళ్లిందని వదిలేస్తారా బీఆర్ నాయుడు అంటూ సూటిగా ప్రశ్నించారు.
గోవు కేవలం జంతువు కాదు.. ఆరాధ్య దైవం. అలాంటి గోవుకి సరైన వైద్యం చేయించకుండా నిర్లక్ష్యం వహిస్తున్న టీటీడీ ఛైర్మన్‌ను బర్తరఫ్ చేయాలంటూ డిమాండ్ చేశారు. గోవుల మృతిపై విచారణ జరగాలి.. ఈ ఘటనపై కోర్టుని ఆశ్రయిస్తాయినని స్పష్టం చేశారు సుబ్రమణ్యస్వామి.
ఇప్పటికే తిరుమల గోశాలలో ఏప్రిల్ 2024 నుంచి మే 2025 వరకు 191 గోవులు చనిపోయినట్టు తెలిపిన టీటీడీ గో సంరక్షణ కేంద్రం వెల్లడించింది. రేపు మీరు కూడా చనిపోతారని.. అప్పుడు వయసు మళ్లారని మిమ్మల్ని పట్టించుకోకుండా మీ కుటుంబ సభ్యులు వదిలేస్తారా? అని సుబ్రమణ్యం స్వామి ప్రశ్నించారు.