తిరుమల లడ్డూ వివాదంలో సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కనీసం దేవుడిని అయిన రాజకీయాలకు దూరం పెట్టండని వెల్లడించింది. ఇవాళ సుప్రీం కోర్టులో తిరుమల లడ్డూపై విచారణ జరుగగా కీలక కామెంట్ చేసింది న్యాయస్థానం.
నెయ్యి రిపోర్ట్ పైన సెకండ్ ఒపీనియన్ తీసుకున్నారా? అని ప్రశ్నించింది. నెయ్యి కల్తీ జరిగినట్టు సాక్ష్యం చూపించాలని..లడ్డును కల్తీ జరిగిందని తేల్చడము శాంపిల్ ల్యాబ్ కి పంపారా? అని ప్రశ్నల వర్షం కురిపించింది. ఇతర సప్లయర్స్ నుండి ఎందుకు శాంపిల్స్ తీసుకోలేదు?, లడ్డు ను ముందుగా ఎందుకు పరీక్షలకు పంపలేదు?అని తెలిపింది.
మైసూర్ లేదా ఘజియాబాద్ ల్యాబ్ నుండి సెకండ్ ఒపీనియన్ తీసుకోలేదు అని చెప్పిన న్యాయస్థానం…కల్తీ నెయ్యి లడ్డు వినియోగంలో వాడినట్లు ఆధారాలు లేవు అని తెలిపింది. లడ్డూ తయారీలో వాడిన నెయ్యిలో చేపనూనె, జంతువుల కొవ్వు, పందికొవ్వు ఉన్నట్లు గుజరాత్ ల్యాబ్ ఇచ్చిన రిపోర్టును సీఎం చంద్రబాబు విడుదల చేసిన సమయాన్ని కూడా సుప్రీంకోర్టు తప్పుబట్టింది.
దీనిపై చంద్రబాబు మీడియాను ఆశ్రయించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించింది. లడ్డూల్ని ముందే పరీక్షలకు ఎందుకు పంపలేదని కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించింది. తదుపరి విచారణను అక్టోబర్ 3కు వాయిదా వేసింది న్యాయస్థానం.