వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పీఠాపురం నుండి పోటీ చేస్తున్నట్లు జనసేనాని పవన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఒక్కసారిగా టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. టీడీపీ ఆఫీస్ ముందు కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. తెలుగు దేశం జెండాలు, ఫ్లెక్సీలను చించేశారు. చంద్రబాబుతో పాటు లోకేష్ ఫ్లెక్సీలను చించేసి పార్టీ కరపత్రాలను తగలబెట్టారు. పీఠాపురం నుండి పవన్ పోటీ చేస్తే ఓడిపోవడం ఖాయమని నినాదాలు చేశారు. దీంతో స్థానికంగా టెన్షన్ వాతావరణం నెలకొంది.
ఇక తిరుపతిలో నాన్ లోకల్ అభ్యర్థికి టీడీపీ టికెట్ ఇవ్వడంపై టీడీపీ – జనసేన నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. పొత్తు ధర్మం పాటించలేదని, చిత్తూరు ఎమ్మేల్యే ఆరని శ్రీనివాసులు కు తిరుపతి సీటు ఎలా కేటాయిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీంతో ఓ ప్రైవేట్ హోట్‌లో ఉమ్మడి సమావేశం నిర్వహించిన టీడీపీ – జనసేన నాయకులు… ఆరని శ్రీనివాసులుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.