Saturday, May 3, 2025
- Advertisement -

విజయనగరం ఎమ్మెల్సీ..పోటీకి టీడీపీ కూటమి దూరం!

- Advertisement -

ఏపీలో మరో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు నగరా మొగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల కోలాహలం నెలకొనగా సిట్టింగ్ సీటును దక్కించుకోవాలని వైసీపీ భావిస్తోండగా పోటీ చేయాలా వద్దా అనే మీమాంసలో ఉంది టీడీపీ.

విజయనగరం జిల్లాలో 753 మంది ఓటర్లు ఉండగా అందులో 548 మంది వైసీపీ ఓటర్లు, 156 మంది టీడీపీ ఓటర్లు, 13 మంది జనసేన, 13 మంది స్వతంత్ర ఓటర్లు ఉన్నారు. ఈ లెక్కన చూస్తే వైసీపీ గెలుపు నల్లేరు మీద నడకే.

అయితే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది పార్టీ మారారు. అయినా మెజార్టీ వైసీపీకే ఉంది. ఈ నేపథ్యంలోనే పోటీ చేయాలా వద్దా అనే తర్జన భర్జన పడుతోంది కూటమి. గతంలో విశాఖ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బలం లేకపోవడంతో దూరంగా ఉండగా ఇప్పుడు కూడా అదే స్ట్రాటజీని ఫాలో అవ్వాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఎందుకంటే పోటీ చేసి ఓడిపోతే అది మైనస్‌గా మారే అవకాశం ఉంది. దీనికి తోడు పెద్దసంఖ్యలో ఓటర్లను లాగినా కూటమి గెలవడం కష్టం. అందుకే పోటీకి దూరంగా ఉండి గౌరవాన్ని కాపాడుకోవాలని భావిస్తున్నారు టీడీపీ నేతలు. మరోవైపు వైసీపీ దూకుడును మరింత పెంచింది. ఈ స్థానం నుండి మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పల నాయుడు పేరును ప్రకటించారు జగన్. బొబ్బిలి నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన 2019లో ప్రొటెం స్పీకర్‌గా కూడా పనిచేశారు. ఈ నెల 28న విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సీటుకు ఎన్నికలు జరగనున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -