విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు సీఎం చంద్రబాబు. టీడీపీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన అనంతరం తన నిర్ణయాన్ని ప్రకటించారు. బలం లేని చోట పోటీ చేసి పరువు పొగొట్టుకోవడం కంటే పోటీకి దూరంగా ఉండటమే మంచిదని భావించిన చంద్రబాబు, బరిలో ఉండటంలో లేదని టీడీపీ నేతలకు తెలిపారు. ఇవాళ మధ్నాహ్నంతో నామినేషన్ల గడువు ముగియనుంది.
వైసీపీ తరపు బొత్స సత్యనారాయణ ఇప్పటికే నామినేషన్ దాఖలు చేయగా మరో స్వతంత్ర అభ్యర్ధి సైతం పోటీలో ఉన్నారు. ఇక పోటీ నుండి ఇండిపెండెంట్ అభ్యర్థి తప్పుకుంటే బొత్స ఎన్నిక ఏకగ్రీవమే కానుంది.
విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పరిధిలో 838 ఓట్లు ఉండగా వైసీపీ బలం 598, టీడీపీకి 240 ఓటర్లు ఉన్నారు. బలం లేకపోవడంతో పోటీకి దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు. అయితే విశాఖ టీడీపీ ఎమ్మెల్పీ అభ్యర్థిగా బైరా దిలీప్ చక్రవర్తి పేరు ప్రముఖంగా వినిపించింది. ఆయన పోటీ చేయడం ఖాయమని ప్రచారం కూడా చేశారు కానీ తీరా చంద్రబాబు దిలీప్ ఆశలపై నీళ్లు చల్లారు. గత ఎన్నికల్లో అనకాపల్లి సీటును ఆశీంచగా అప్పుడు కూడా దిలీప్‌కు నిరాశే మిగిలింది. పొత్తులో భాగంగా అనకాపల్లి సీటును బీజేపీకి కేటాయించారు చంద్రబాబు.