తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాల ముహూర్తం ఖరారు అయింది. డిసెంబర్ 9 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనుండగా ఈసారి సమావేశాలు వాడివేడిగా జరగనున్నాయి. ప్రధానంగా రైతు సమస్యలు, కులగణనపై చర్చ జరిగే అవకాశం ఉంది.
ఈ సమావేశాల్లో పలు కీలక చట్టాల ఆమోదానికి రేవంత్ సర్కారు ప్లాన్ చేస్తోంది. ఆర్ఓఆర్ చట్టంతో పాటు పంచాయతీ ఎన్నికలపై కూడా గవర్నమెంట్ కసరత్తు చేస్తోందని తెలుస్తోంది.
అలాగే మంత్రివర్గ విస్తరణ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని తెలిసింది. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల తర్వాతే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించగా ఆశావాహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. త్వరలో సర్పంచ్ ఎలక్షన్స్ నిర్వహించాలని భావిస్తోంది సర్కార్. అలాగే
పంచాయతీ ఎన్నికలకు ముందే ఆసరా పెన్షన్, రైతు భరోసా పథకం కింద ఇచ్చే మొత్తాన్ని పెంచేందుకు రేవంత్ సర్కారు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.